మానకొండూర్ ప్రతినిధి, జనత న్యూస్: ప్రజా తీర్పును గౌరవించాలి అనుకున్న వారంతా మార్పును కోరుకున్నారని, ప్రజాత తీర్పును గౌరవిస్తూ, ప్రజాసేవలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో మాట్లాడారు. లక్షల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు అందించానని, 10 ఏళ్ల కాలం ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో సహజమని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మార్పులు కోరుకున్నారని, దానికి కట్టుబడి ఉండాలని ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తా..ప్రజా సేవలోనే వుంటా..: రసమయి బాలకిషన్
- Advertisment -