(బూట్ల సూర్య ప్రకాష్, మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి, జనత న్యూస్)
సీఎం కేసీఆర్ సోమవారం రోజు మానకొండూర్ నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలంలో గల చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు కలిసి వస్తుందా లేదా అని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఇతర ప్రజాప్రతిని పలువురు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిపోయి ప్రచార పర్వంలో కాంగ్రెస్స్ తరుపున చురుకుగా పాల్గొంటున్నారు. ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరటానికి సిద్ధమవుతున్నట్లు తెలియ వచ్చింది. ఈ వలసలు సీఎం సమావేశం అనంతరం ఐనా ఆగిపోతాయని ఆగిపోతాయా లేదా అని పలువురు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచార పర్వం సాగుతున్న వలసలపర్వం మాత్రం ఆగడం లేదు. ఇలాగే జరిగితే రసమయి బాలకిషన్ గెలుపు కష్టమేనని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు. సీఎం సమావేశంతో నైన అసంతృప్తిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, లీడర్లు కలిసి వస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ప్రచార పర్వంలో వెనుకబడిన బీఆర్ఎస్ మండల గ్రామస్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించడం లేదని పలువురు కినుక వహించినట్లు తెలియవచింది. సీఎం ప్రజా ఆశీర్వాద సభ తర్వాత నైనా రసమయి వ్యవహారశీలనలో మార్పు వస్తుందా లేదా అని లేకుంటే పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే బిజెపి ప్రస్తుత అభ్యర్థి ఆరేపల్లి మోహన్ సైతం చాపకింది నీరు లాగా రసమయి ఓటు బ్యాంకుని దెబ్బతీస్తున్నట్లుగా తెలియవచ్చింది. రెండు రోజుల వరకు వేచి చూస్తే గానీ ఏమవుతుందో ఏమోగానీ తెలియదు.