Wednesday, July 2, 2025

వణ్య ప్రాణులను బాంబులతో మట్టుబెడుతూ..

మాసం విక్రయిస్తూ..మరో దందా
పేలుడు పదార్థాల తయారీదారుడి అరెస్టు
మరో ముగ్గురిపై కేసు నమోదు..
కోణారావుపేట-జనత న్యూస్‌
నాటు బాంబులతో వణ్య ప్రాణులను మట్టుబెడుతూ, మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు సిరిసిల్ల జిల్లా పోలీసులు. కోనరావుపేట మండలంలో ధర్మారంలో నాటు బాంబులను తయారు చేసిన వ్యక్తితో పాటు, వాటిని ఉపయోగించి వన్యప్రాణులను హత్య చేసేందుకు చూసిన మరో ముగ్గురి వ్యక్తులపై ఆదివారం పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ సందర్భంగా చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..కోణారావుపేట మండలం ధర్మారంలో గత రెండు రోజుల క్రితం నాటు బాంబును గేదె నములు తుండగా..అది పేలి బర్రె మృతి చెందిందని, ఈ సంఘటనతో యజమాని ముడికే మల్లేశం పోలీసులకు పిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. దీంతో గతంలో అదే గ్రామానికి చెందిన నాటు బాంబులు తయారు చేసి పోలీసులకు పట్టుబడిన పిట్టల రాజలింగంపై నిఘా పెట్టామని, రాజలింగం తయారుచేసిన బాంబులను చిన్న బోనాల గ్రామానికి చెందిన పడిగే లక్ష్మయ్య, తుమ్మల కనకరాజు లకు అమ్ముతుండగా చాకచక్యంగా పట్టుకున్నామని అన్నారు. వారి వద్ద నుండి 27 నాటు బాంబులు, వాటి తయారికి కావాల్సిన మూడి సరుకును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అంతే కాకుండా పిట్టల రాజలింగం సర్దాపూర్‌ గ్రామానికి చెందిన మొగిలి అంజయ్య అనే వ్యక్తికి కూడా మరిన్ని నాటు బాంబులను అమ్మానని నేరం ఒప్పుకున్నాడని తెలిపారు.


వణ్యప్రాణులను ఇలా మట్టుబెడుతూ..
తయారు చేసిన నాటు బాంబులను వివిధ జంతువులపై ప్రయోగిస్తారు. ఆయా జంతువులు తీనే అహారాన్ని పై పూతగా పూసి కళ్లముందు వదులుతారు. దీంతో నోటితో బాంబును తీసుకోగానే పేలిపోయి మృతి చెందాక, ఆ మాంసాన్ని తీసి విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఇలా అడవి పందులు, గొర్లు, మేకలు, గేదెలను..నాటు బాంబులతో వదించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
సర్ధాపూర్‌కు చెందిన మొగిలి అంజయ్య ఇంటినీ సోదా చేయగా 40 నాటు బాంబులు దొరికాయని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ధర్మారం గ్రామంలో నాటుబాంబుకు పిండిని పూతగా రాసి గేదెకు పెట్టడంతో చనిపోయినట్లు అంజయ్య నేరంను ఒప్పుకున్నట్లు తెలిపారు. అనతిపై అటవీ చట్టం, ఎక్స్‌ ప్లోజీవ్స్‌ చట్టం ప్రకారం కోనరావుపేట పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఇదే క్రమంలో వేటగాళ్లు సీమ పందులను కోసి, అడవి జంతువుల మాంసమని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మండలంలో ఇంకా ఎవరైనా వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడినట్లయితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కేసును చేదించిన రుద్రంగి ఎస్‌.ఐ అశోక్‌, కోనరావుపేట ఇన్చార్జి ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌, ఏఎస్‌ఐ రఘుపతి రెడ్డి పోలీస్‌ కానిస్టేబుళ్లు విశాల్‌ రాజ్‌, సతీష్‌, రవి, ఓదెల్‌, అభిషేక్‌,లను సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page