రైతు భరోస సొమ్ము ఎగ్గొట్టినందుకా ?
కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
కరీంనగర్-జనత న్యూస్
ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేతలను ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన ప్రటకన విడుదల చేశారు. రబీ, ఖరీఫ్‌లో రైతు భరోస సొమ్ము ఎగ్గొట్టారని, రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రానున్న స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అడుతున్నారని ఆరోపించారు. గత రెండు సీజన్లలో కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదని ప్రకటనలో నిలదీశారు. రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతున్నారని ఆరోపించారు. రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీతో సహ బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత సర్కారుదే నని పేర్కొన్నారు.