మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.
ఇల్లంతకుంట, జనతా న్యూస్: అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తామని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ అన్నారు.
శనివారం వేకువజామునే మండలంలోని పొత్తూరు గ్రాములు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు కుంటలు కొందరు వ్యక్తులు ఆక్రమించారని, ఇదే మండలంలోని అనంతారం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన 150 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నట్లు నా దృష్టికి వచ్చిందని, దీనిపై అధికారులతో విచారణ జరిపించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మధ్యనే బెజ్జంకిలో ఆక్రమణకు గురైన సుమారు 35 ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేశామని చెప్పారు.
పొత్తూరులో వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, పేరుకుపోయిన మురుగునీటి కాలువలు పరిశీలించి పరిష్కారానికై అప్పటికప్పుడే ప్రత్యేక అధికారికి ఆదేశాలు ఇచ్చారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నివాసయోగ్యంగా లేవని వాటిపై అధికారులతో సమీక్ష చేసి తగు ఏర్పాట్లు కల్పించి అర్హులకు అందజేస్తామన్నారు.
సాగునీటి సమస్యకు మేడిగడ్డ కుంగడమే కారణం.
మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీటి సమస్య రావడానికి మేడిగడ్డ కుంగడమే కారణమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రభుత్వం అధికారం లోకి రాకముందే మేడిగడ్డ కుంగిపోవడం డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనతో నీటిని సముద్రంలోకి వదిలారని దానివల్లనే మధ్య మానేరు నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఎత్తిపోసే అన్ని నీళ్లు లేక ఈ సమస్య వచ్చిందని ప్రజలు సమన్వయం పాటించాలని నీటి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లానని తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి ఎంపీపీ రమణారెడ్డి అధికార ప్రతినిధి పసుల వెంకటి యువజన సంఘ నాయకుడు వినయ్ కుమార్ పొత్తూరు గ్రామ శాఖ వివిధ గ్రామాల ఎంపిటిసిలు సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.