‘ జనతా ’తో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ముఖాముఖి
బూట్ల సూర్య ప్రకాష్ (మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్)
తాను గెలిస్తే మానకొండూర్ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయనను ‘జనతా న్యూస్’ సంప్రదించింది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈ సందర్భంగా జనతా నిర్వహించిన ‘ఇన్నర్ వ్యూ’ వివరాల్లోకి వెళితే..
- జనత: మీరు 2009 ఎన్నికల సమయంలో అలుగునూర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పారు. దాని గురించి ఇప్పుడేమంటారు?
కవ్వంపల్లి: అలుగునూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం. అయితే గతంలో ఓడిపోయినందున సాధ్యం కాలేదు. కానీ ఈసారి గెలిస్తే తప్పకుండా కరీంనగర్ కు సమీపంలో ఉన్న అలుగునూర్ లో సూప్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు తక్కువ ఖర్చులకే వైద్య సేవలు అందిస్తాం.

- జనత : కాంగ్రెస్ పై యువత స్పందన ఎలా ఉంది? మీరు వారికి ఇచ్చే హామీ ఏమిటి?
కవ్వంపల్లి: మేం నిర్వహిస్తున్ ప్రచాంలో యువతే ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్న ఉత్సాహం మాకంటే వారిలోనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం యూత్ కు ఉద్యోగాలు లేక ఎంతో నిరాశతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం వారికి ఉంది. అందువల్ల వారి సపోర్టు మాకు తప్పనిసరిగా ఉంటుంది. - జనత : మీ ప్రచార సరళి ఎలా ఉంది ?
కవ్వంపల్లి: నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లపట్ల ఆకర్షితులవుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్యస్పందన లభిస్తుంది. ప్రజల స్పందన చూస్తుంటే ఇప్పుడే గెలిచినంత ఫీలింగ్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది. - జనత : మీరు ఒంటరి పోరు చేస్తున్నారు.. పార్టీ అగ్ర నాయకులు ఎవరూ కనిపించడం లేదు.. ఎందుకని?
కవ్వంపల్లి: మా ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొనకున్నా.. వారి అండదండలు ఎప్పటికీఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గ పరిస్థితి వారు తెలుసుకుంటూనే ఉన్నారు. విపక్ష నేతలు దీనిని ఆసరాగా చేసుకొని కుటిల రాజకీయకీయం చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు.