బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బిగుల్లా మోహన్.
బెజ్జంకి, జనత న్యూస్: బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం బి ఆర్ ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ బిగుల్లా మోహన్ అధికార కాంగ్రెస్ మండల నాయకులను ఉద్దేశించి పత్రికా ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించాలని కోరుతూ, అనవసర విమర్శలు మాని ప్రజా అభివృద్ధిపై, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలని దానికి అవసరమైన ప్రజా సమస్యల పరిష్కారంలో మేమునిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని తెలిపారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని,కాంగ్రెస్ నాయకులు కొంతమంది సోషల్ మీడియా లో గెలిచినమని యువతను రెచ్చడోట్టే పోస్టులు, పెడ్తున్నారన్నారు. కెసిఆర్ పైన ఎవరైనా తప్పుడు కామెంట్ పోస్టులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు.
