బెంగుళూరు: రాయల్ చాలెంజర్ స్ బెంగళూరు ప్లేయర్ వాట్సన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్ సి బి ఓడిపోవడానికి తాను కారణమయ్యాడని తెలిపారు. అయితే ఈ మ్యాచ్ 2016లో జరిగిన ఐపీఎల్ లోనిది. తాజాగా షేన్ వాట్సన్ బెంగళూరులోని రెసిడెన్సి యూనివర్సిటీలో మాట్లాడుతూ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్న ఆర్సీబీ అభిమానులందరికీ నేను క్షమాపణ చెప్పాలి. దానికి కారణం చిన్న స్వామి స్టేడియంలో 2016 ఐపీఎల్ ఫైనల్ ఫైనల్ లో నా కారణంగా ఓడిపోయింది. ఫైనల్ కి ముందు నేను బాగా సిద్ధమయ్యాను. జట్టు కోసం గొప్ప ప్రదర్శన ఇవ్వాలని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఫైనల్ లో చెత్త బౌలింగ్ తో ఆర్సిబి ఓడిపోవడానికి కారణమయ్యాను’ అని చెప్పాడు.
అయితే 2016లో సన్రైజర్స్ తో జరిగిన ఫైనల్ లో బెంగళూరు ఓడిపోవడానికి వాట్సన్ కారణమని అందరికీ తెలిసిందే. ఆ సిరీస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట బౌలింగ్లో 41 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్లో తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్ తో సహా 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ప్రస్తుత సీజన్లో ఆర్సిబీ ప్లే ఆఫ్ కు వెళ్ళింది. ఈ సందర్భంగా షేన్ వాట్సన్ చేసిన వాఖ్యలు ఆసక్తికరమయ్యాయి.
Shane Watson apologising to RCB for the 2016 Final. 🥹❤️
– A gem of a guy, Watson!pic.twitter.com/eerJuec7Yn
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024