ఇల్లంతకుంట, జనతా న్యూస్. బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పరిపాలన వల్లనే నీటి కొరత ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి అన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లేని ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల మేడిగడ్డ బీటలు వారిందని అన్నారం ప్రాజెక్టు బుంగ పడడంతో నాటి ప్రభుత్వమే నీటిని ఖాళీ చేసి సముద్రంలోకి వదిలారని దీని మూలంగా మిగతా రిజర్వాయర్ లోకి నీళ్లు నింపే పరిస్థితి లేక డెడ్ స్టోరేజ్ కి వెళ్లాయని అందుకే ఈ పరిస్థితి దాపురించింది అన్నారు . దయ్యాలు వేదాలు వల్లించే చందంగా నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరువు కాంగ్రెస్ వల్లే వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద లింగాపూర్ ఎంపీటీసీ కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బడుగు లింగం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మచ్చ రాజేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ ఫిషరీస్ మండల అధ్యక్షులు జెట్టి మల్లేశం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసు పాక రమేష్ బట్టి చంద్రమౌళి గూడ నరేందర్ రెడ్డి మండల కార్యదర్శి నేతబాబు మల్లయ్య పసుల కేశవులు మచ్చ దాసు బంగారు ఆంజనేయులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అవినీతి పరిపాలన వల్లే నీటి కొరత
- Advertisment -