Warangal Congress :వరంగల్,జనతా న్యూస్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి రాకతో పరకాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియంతృత్వ పోకడాలతో విసిగిపోయిన జనం కారు దిగిపోతున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేత ప్రకాష్ రాథోడ్ అసెంబ్లీ ఏఐసీసీ పరిశీలకులు శ్రవణ్ శోభారాణి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇన్నేళ్లు ప్రత్యాన్మాయం కనిపించక దిక్కుతోచని పరిస్థితిలో కొనసాగిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్లో రేవూరి రాకతో ఆశలు చిగురించాయి. మచ్చ లేని వ్యక్తిత్వం ఉన్న రేవూరితో కలిసి పని చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు రేవూరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నీతి గల నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా లక్ష్మీపురం ఎంపీటీసీ పల్లెబోయిన సునీత, మాజీ ఎంపిటిసి బండి నారాయణ, పల్లెబోయిన శ్రీను, సర్పంచ్ ఆముదాలపల్లి క్రాంతి గౌడ్, పోచారం మాజీ ఎంపీటీసీ కోరె శ్రీను, ఎస్సారెస్పీ చైర్మన్ పల్లె బోయిన రవి, వెంకటాపూర్ సర్పంచ్ సిలువేరు ఈశ్వరమ్మ- చిన్నయ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ పార్లమెంటు పరిశీలకులు రవీందర్రావు ఉత్తమ దల్వి గారు కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేత ప్రకాశ్ రాథోడ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఏఐసీసీ పరిశీలకులు శోభారాణి, శ్రవణ్ పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు. కలిసికట్టుగా పనిచేసి రేవూరి ప్రకాశ్ రెడ్డి గారిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.