వరంగల్, జనతా న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మొదట పోస్టర్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టినారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ వచ్చింది . ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్ల ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినారు. ఇందులో ప్రధానంగా హనుమకొండ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ( హనుమకొండ), పరకాల నియోజకవర్గం లో ఈ మూడింటిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో హనుమకొండ నుండి నాయిని రాజేందర్ రెడ్డి( కాంగ్రెస్)14 వేల ఆదిక్యంతో గెలిచారు, వరంగల్ తూర్పు కొండా సురేఖ 15,043 ఓట్లు ఆదిక్యంతో గెలిచారు, అదేవిధంగా పరకాల నియోజకవర్గ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి 4,900 మెజార్టీతో విజయం సాధించారు.
ఈ మూడు స్థానాలలో ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న దాస్యం వినయ భాస్కర్, నన్నపనీరు నరేందర్, చల్ల ధర్మారెడ్డిలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 శాసనసభ స్థానాలకు గాను 10 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్టేషన్గన్పూర్, జనగామ నియోజకవర్గాలలో మాత్రమే భారత రాష్ట్ర సమితి( బి ఆర్ ఎస్ )విజయం సాధించింది. హనుమకొండ 14 రౌండ్లు ఉండగా, పరకాల 18 రౌండ్లు ఉన్నాయి ఇందులో మొదటినుండి కాంగ్రెస్ పార్టీ లీడింగును( ముద్దాంజలో) కొనసాగింది కొన్ని 11 రౌండ్ లో టిఆర్ఎస్ స్వల్పంగా ఒకటి రెండు వందలు ముందంజలో కొనసాగిన తిరిగి కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలో 3000 నుండి 4000 మెజార్టీతో ముందంజలోనే కొనసాగింది. అయితే ఉదయం నుండి ప్రతి రౌండ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ముందే ఊహించినప్పటికీ మధ్య మధ్యలో రౌండ్లలో స్వల్ప మెజార్టీ టిఆర్ఎస్ అభ్యర్థులు రావడం ఒక దశలో మార్పు సంభవిస్తుందా లేదా అని భావించారు. ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే హనుమకొండ జిల్లా శాసనసభ పరిధి లో మూడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది.
పరకాల అనుమకొండ నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠం రేపింది. ముఖ్యంగా టిఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపూరు ప్రకాష్ రెడ్డి మధ్యలో జరిగిన ఈ ఎన్నికల పోటీ నువ్వా నేనా అన్న విధంగా ఒక రౌండ్ టిఆర్ఎస్ ఒక రౌండ్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగింది. అదేవిధంగా హనుమకొండ (వరంగల్ పశ్చిమ) నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మధ్యనే కొనసాగింది ఒక దశలో హనుమకొండ స్థానంలో టిఆర్ఎస్ ముందంజ, మల్లొక రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ అన్నట్లుగానే కొనసాగి చివరికి ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది