వరంగల్, జనతా న్యూస్: హనుమకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 504 505 కింద కేటీఆర్ పై కేసు నమోదు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వరంగల్: కేటీఆర్ పై కేసు నమోదు
- Advertisment -
