బాలికకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోస
చొప్పదండి-జనత న్యూస్
‘‘ కూలీ పనులకెళ్లద్దు..చక్కగా కాలేజీకి వెళ్లు ! నేను చదివిస్తా’’ అని బాలికకు భరోసా కల్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ సంజయ్. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం తిరుగు ప్రయాణంలో..రోడ్డుపై ఉన్న కూలీలను చూసి అక్కడే వాహనాన్ని ఆపి, వారి వద్దకు వెళ్లి పలకరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అందులో ఓ బాలికను చూసి ఆయన..ి ‘ఏం తల్లి… పనికి వెళుతున్నవ్. చదువు ఇష్టం లేదా?’ అని ప్రశ్నించడంతోపాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బోళ్ల అక్షయ్య అని, టెన్త్ పాసైనప్పటికీ ఆర్దిక పరిస్థితి బాగాలేక కూలీ పనులకు వెళుతున్నానని బదులిచ్చింది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తీసుకుని, వెంటనే కాలేజీలో చేర్పించాలని, ఆసక్తి ఉంటే హాస్టల్‌లో జాయిన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ బాలిక బండి సంజయ్ కు థ్యాంక్స్ చెప్పింది.