సిద్ధిపేట, జనతా న్యూస్ :తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో గల దుబ్బాక నియోజకవర్గంలో 3, గజ్వేల్ నియోజకవర్గంలో 10 పోలింగ్ స్టేషన్ల పేర్లలో మార్పుల గూర్చి రాజకీయ పార్టీ సభ్యులతో చర్చించారు. ఈసిఐ మార్గదర్శకాలు ప్రకారం ఓటర్ లిస్ట్ త్వరలో అందింస్తామన్నారు. సూవిద-ఆప్ లో ఏమైన సాంకేతిక సమస్యలు ఎదురైతే నేరుగా నియోజకవర్గ ఆర్ఓ నేరుగా అనుమతి కోసం సంప్రదింపులు జరపాలని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో జరిగే రాజకీయ పార్టీల వివిధ కార్యకలాపాలను తప్పనిసరిగా ముందస్తు అనుమతితోనే నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
జిల్లాలో దివ్యాంగులు, 80సంవత్సరాల వయసు గల వారు పాం-12డి అప్లై ద్వారా అప్లై చేసుకోవాలి అన్నారు.ఈ సమావేశంలో దుబ్బాక, హుస్నాబాద్ ఆర్వోలు గరిమా అగ్రవాల్, బెన్ షాలం, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జే. మోహన్లాల్, బిజెపి పార్టీ ప్రతినిధి బోగి శ్రీనివాస్ , ఎంఐఎం పార్టీ ప్రతినిధి ఎండి మునీర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి జి.మధు, తదితరులు పాల్గొన్నారు.