కేరళ సినీ ఇండస్ట్రీలో ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ హేమ కమిటీ రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక ..అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేసేలా చేసింది. నటీమనులు రేవతి సంపత్, మిను మునీర్ కొంత మంది లైంగిక వేధింపులకు గురి చేశారంటూ వెల్లడిరచడం సంచలనాన్ని రేపుతోంది. దక్షిణాది భాషల్లో 80కి పైగా చిత్రాలలో నటించి, అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న మీనన్ 2017లో లైంగిక వేధింపులకు గురౌనట్లు తాజాగా ప్రకటించడం సినీ పరిశ్రమలో ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. మళయాల సినీ పరిశ్రమలో వెలుగులోకి వస్తున్న పలు సంఘటనల నేపథ్యంలో టాలీవుడ్ పరిశ్రమలోనూ ఇలాంటివేమైనా జరిగి ఉంటాయా..అనే చర్చ సినీ అభిమానుల్లో వ్యక్తమౌతోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2019లో మహిళల కోసం ఏర్పడిన ‘గ్రూపు ది వాయిస్ ఆఫ్ వుమెన్’ నివేదిక బహిర్గతం చేయాలనే డిమాండ్ తాజాగా వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ నటీ సమంత చేసిన పోస్టు వైరల్ అవుతోంది. కేరళ తరహాలో తెలంగాణా లోనూ నివేదిక బహిర్గం చేయాలని కోరడం సంచలనం రేపుతోంది. దీనిపై రేవంత్ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో నని సినీ పరిశ్రమ, అభిమానులు ఎదురు చూస్తున్నారు.
‘ వాయిస్ ఆఫ్ విమెన్’లో ఏముంది ?
- Advertisment -