Vishaka Floating Bridge: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం సముంద్రంలో ప్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ బ్రిడ్జిని ఆదివారం ప్రారంభిస్తే సోమవారం తెగిపోయిందని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. ప్లోటింగ్ బ్రిడ్జి ఇంకా ప్రారంభించనేలేదని, బ్రిడ్జి పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియలో భాగంగా డీ లింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహించామని అన్నారు. ఈ మేరకు విశాఖ జిల్లాకలెక్టర్,మెట్రోపాలిటన్ కమిషన్ డాక్టర్ మల్లిఖార్జున్ పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జి గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే సోమవారం సందర్శకులను అనుమతించలేదని, బ్రిడ్జి తెగినందునే అనుమతించలేనది తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. సముంద్రంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, ఇవి సాధారణమే అన్నారు.
Vishaka Floating Bridge: విశాఖ ప్లోటింగ్ బ్రిడ్జి తెగడంపై అధికారుల క్లారిటీ..
- Advertisment -