Thursday, September 11, 2025

అనాథ పిల్లల మధ్య వినోద్ కుమార్ దంపతుల దీపావళి వేడుకలు

కరీంనగర్, జనతా న్యూస్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఆయన సతీమణి డాక్టర్ మాధవి లు దీపావళి వేడుకలను ఆదివారం కరీంనగర్లోని అనాథ పిల్లల ఆశ్రమం ‘బాల గోకులం’ లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పిల్లలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలగోకులం పిల్లలకు భోజన వసతిని కల్పించి వారికి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో బాల గోకులం చైర్మన్ రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ ఐలందర్ యాదవ్, ప్యాక్స్ చైర్మన్ శరత్ రావు, తదితరులు పాల్గొన్నారు

vinod kumar 2
vinod kumar 2
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page