కరీంనగర్, జనతా న్యూస్:బీఆర్ఎస్ నాయకుడు మేచినేని అశోక్ రావు తండ్రి నారాయణ రావు గురువారం మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అశోక్ రావు భార్య వనజ ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గా ఉన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ మాజీ కార్పొరేటర్, న్యాయవాది ఏ వీ రమణ తల్లి స్వర్గీయ ఎడ్ల ఆండాలు చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.గురువారం ఏ వీ రమణ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని వినోద్ కుమార్ సూచించారు.
బీఆర్ఎస్ నాయకులకు వినోద్ కుమార్ పరామర్శ
- Advertisment -