ఇల్లంతకుంట జనతా న్యూస్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విద్యావంతుడైనటువంటి బోయినిపల్లి వినోద్ కుమార్ ని ఎంపీగా గెలిపించుకోవాలని రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం
ఇల్లంతకుంట బీఆర్ఎస్ కార్యాలయంలో యూత్ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి…ప్రజల సంక్షేమం కోసం…అభివృద్ధి కోసం ఆరాటపడే విద్యావంతుడైన వినోద్ కుమార్ గతంలో 2014నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకువచ్చాడని, మనోహర్-కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకు వచ్చారన్నారు.ఐదేళ్లు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని… నవోదయ పాఠశాల, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధి కోసం ఐదు కొత్తలు కూడా తేలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని …రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదని.. రైతుభరోసా ద్వారా రైతులకు ఇస్తామన్న 15వేల సాయం చేయలేదని అన్నారు. మన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా యువజన నాయకులు జక్కుల నాగరాజు, ఏనుగు రవీందర్ రెడ్డి,యువ జన విభాగం మండల నాయకులు. సాదుల్, ఏండ్ర చందన్, సావనపల్లి అనిల్ కుమార్, పట్నం శ్రీనివాస్,బాలకిషన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్, వొళ్ళలా వెంకటేశం,కూనబోయిన రఘు,పండగ భాస్కర్,మల్యాల శేఖర్,కుశ నరేష్,శశి,నాగరాజు, నరేష్ తోట తిరుపతి, అంజయ్య, మధు,కార్తీక్, శ్రీకాంత్,బర్ల రమేష్, సతీష్,లింగంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు