విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఆటోనగర్ లో ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ప్రమాదం కారణంగా మంటలు పెద్ద ఎత్తున లేచాయి. దీంతో ఈ ప్రాంతం చుట్టుపక్కల పొగ దట్టంగా అలుముకుంది. అయితే ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన స్థలానికి పోలీసులు వచ్చి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
విజయవాడ: ఆయిల్ ట్యాంకర్ లో భారీ అగ్ని ప్రమాదం
- Advertisment -