Vijayawada: విజయవాడ, జనతా న్యూస్: బస్సుకు దారి ఇవ్వలేదని కొందరు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ బైపాస్ దగ్గర విజయవాడ నుంచి కావలి వెళ్తున్న బస్సు తమకు దారి ఇవ్వలేదన్న కారణంతో కొందరు బస్సును ఆపి డ్రైవర్ ను కిందకు దించారు. ఆ తరువాత అతనిపై తీవ్రంగా దాడి చేశారు. అయితే డ్రైవర్ ఒక్కరే ఉండడంతో వారిని ఎదుర్కోలేకపోయారు. దీంతో డ్రైవర్ సొమ్మసిల్లి పోడియారు. ఇదంతా జరుగుతున్నా ప్రయాణికులు ఎవరూ అడ్డుకోలేకపోయారు. చివరికి ఒక పెద్దాయని డ్రైవర్ దగ్గరికి రాగా అతనిపై దాడికి యత్నించారు. అయితే ఈ సంఘటనను కొందరు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై టీడీపీ కీలక నేత లోకేశ్ స్పందించారు. హారన్ కొట్టడమే నేరమా? అని అన్నారు. నడిరోడ్డుపై పట్టపగలు ఘోరంగా దాడి చేశారని అన్నారు.
వైసీపీ అధినేత తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారు. కావలిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైంది. నడిరోడ్డుపై… pic.twitter.com/URVrSWIUde
— Lokesh Nara (@naralokesh) October 28, 2023