Vijayanagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కంటకాలపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్ ను పలాస ప్యాసింజర్ ఢీకొనడంతో పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్ రైలు మూడు భోగీలు చెల్లాచెదరయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక మంత్రి బొత్స నారాయణ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఎస్పీని సంఘటన స్థలానికి హుటా హుటికి పంపించింది.
Vijayanagaram : ఘోర రైలు ప్రమాదం..9మంది మృతి..
- Advertisment -