Vijayadashami 2023 : కొన్ని సంవత్సరాలుగా పండుగల నిర్వహణపై సందిగ్ధం నెలకొంటోంది. తేదీల్లో తిథులు, నక్షత్రాల్లో మార్పులు రావడంతో కొన్ని పండుగలను ఎప్పుడు నిర్వహించుకోవాలా? అనేది అయోమయంగా నెలకొంది. మొన్నటికి మొన్న వినాయక చవితి సెప్టెంబర్ 18న నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెప్పగా.. 19నేజరుపుకోవాలని మరికొందరు వాదించారు. దీంతో రెండు రోజులు పండుగ నిర్వహించుకోవాల్సి వచ్చింది. తాజాగా దసరా (విజయదశమి) ఎప్పుడు అనేది సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు దసరా పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలి అనేదానిపై కొందరు ఏం చెబుతున్నారంటే?
22 అక్టోబర్ 2023 ఆదివారంన దుర్గాష్టమి రోజు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈరోజు సువాసిని పూజ జరపాలని అంటున్నారు. 23 అక్టోబర్ 2023న మహర్నవమి, సాయంత్రం జమ్మిపూజ జరుపుకోవాలని తెలుపుతున్నారు. అయితే చాలా క్యాలెండర్లలో 24న దసరా జరుపుకోవాలని సూచించారు. ఒక వర్గం వారు 24న మంగళవారం నాడే జరుపుకోవాలని వాదిస్తున్నారు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రభుత్వం ముందుగా 24వ తేదీన దసరా సెలవును ప్రకటించింది. ఆ తరువాత కొందరు పండితులుచెప్పిన ప్రకారం 23, 24న దసరా సెలవులుగా నిర్ణయించింది. దీంతో 22 బతుకమ్మ, 23 దసరా సెలవులుగా కొందరు వాదిస్తున్నారు. కొందరు పండితులు మాత్రం 23న సాయంత్రం విజయదశమి గడియలు మొదలవుతున్నందున 24న మంగళవారం రోజంతా నిర్వహించుకోవచ్చని అంటున్నారు.