హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ మీరో వెంకటేశ్ రెండో కుమార్తె వివాహం మార్చి 15న 2024న వైభవంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హాజరయ్యారు. 2023 అక్టోబర్ 25న వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించగా ఆ సమయంలో చిరంజీవి, మహేష్ బాబు లతో పాటు కొంత మంది మాత్రమే హాజరయ్యారు. కాగా వరుడు విజయవాడకు చెందిన వైద్యుడు. వరుడి తల్లిదండ్రులు కూడా వైద్యులే. దగ్గుబటి వెంకటేశ్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్తతో 2019లో జరిగింది.