కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
పార్లమెంటు నియోజక వర్గంలో విస్తృత పర్యటన
మృతుల కుటుంబాలకు పరామర్శ
జనత న్యూస్ నెట్‌వర్క్ :
వేమలవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్థానన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతానని మరోసారి స్ఫష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. వేములవాడ మహంకాళి అమ్మవారికిప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం చందుర్తి మండలం లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 30 లక్షల 50 వేలతో చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaూ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ రావు, సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, అల్లాడి రమేష్, రాకేష్, తిరుపతి, ప్రతాప రామకృష్ణ, ఎర్రం మహేష్,అధికారులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశానని.. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేసహా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు, రాజన్న ఆలయాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో అందరూ కలిసి రావాలని బండి సంజయ్ కోరారు.
బోయినిపల్లి మండలంలో..
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన నక్క సాయి కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం
మర్లపేట గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కేశవేణి అంజయ్య తండ్రి పోచయ్య మృతి చెందగా..వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డితో పాటు పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహాచారి, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, క్యాతం తిరుపతిరెడ్డి, కొండం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.