వేములవాడ, జనతా న్యూస్ : వేములవాడ నియోజకవర్గంలో టికెట్ గందరగోళం ఏర్పడింది. బీజేపీ అధిష్టానంముందుగా ఇక్కడ తుల ఉమ పేరును ప్రకటించారు.అయితే కొన్ని రోజుల పాటు పార్టీ తరుపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వికాస్ రావు ను కాదని తుల ఉమకు టికెట్ ఇవ్వడం వల్ల నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలంలో బండి సంజయ్ వర్సెస్ ఈటల వర్గీయులు అన్నట్లుగా కోల్డ్ వార్ సాగింది. ఈ నిరసనల నేపథ్యంలో చివరికి శుక్రవారం భీ ఫాం ను వికాస్ రావుకు అందించారు. అయితే తనకు భీ ఫాం ఇచ్చినందునే నామినేషన్ వేశానని తుల ఉమ పేర్కొన్నారు. అటు వికాస్ రావు అనుచరులు నామినేషన్ వేసిన తరువాత భీ ఫాంను అందజేశారు. ఉత్కంఠతో సాగిన ఇక్కడ చివరి నిమిషంలో వికాస్ రావుకు టికెట్ రావడం చర్చనీయాంశంగా మారింది.
వేములవాడ బీజేపీ టికెట్ గందరగోళం..
- Advertisment -