Sunday, September 14, 2025

Veluchala Rajender Rao: రాముడిని పూజిద్దాం..బీజేపీని తొక్కేద్దాం

కరీంనగర్​,జనతా న్యూస్​:కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయినటువంటి పాంచ్ నాయ్ ను ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా 11 రోజులు మాత్రమే ఉందని, పార్టీ శ్రేణులు బూతులు స్థాయి కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో పాటు ఏఐసీసీ ప్రకటించిన పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోని ప్రజల గుండెల్లో చేరేలా తీసుకెళ్లాలని కోరారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తే సామాన్య మధ్య తరగతి ప్రజలు పడే బాధలను ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలకు తెలియపరచాలని చెప్పారు. రాముని పూజిద్దాం.. బిజెపిని తొక్కేద్దాం.. అనే నినాదాన్ని ముందేసుకొని ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు ఇస్తానన్న లక్ష రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తుందని, జీఎస్టీ అని 18 నుంచి 12 శాతాన్ని కుదించి నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తుందని ప్రజలకు వివరంగా తెలపాలని కోరారు. రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో అన్ని బూతుల్లోనూ భారీ మెజార్టీ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page