జనత న్యూస్ బెజ్జంకి : పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని అతని సతీమణి వెలిచాల రేఖ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్, కెసిఆర్ ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనను తలపించిందని ప్రశ్నిస్తే కేసులు కోర్టులు అంటూ కార్యకర్తల గొంతు నొక్కె ప్రయత్నం చేసిందని అన్నారు. బెజ్జంకి మండలాన్ని ప్రజలకు ఇష్టం లేకున్నా రెండు ముక్కలుగా చేసి స్వార్థ ప్రయోజనాల కోసం బలవంతంగా సిద్దిపేటలో కలుపుకున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలుపుతా అనే ఇచ్చిన మాట ప్రకారం దానిని నిలబెట్టుకోవడం కోసం కార్యక్రమాన్ని సిద్ధం చేశారని పార్లమెంట్ ఎన్నికల అనంతరమే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బెజ్జంకి మండల ప్రజల బలమైన కోరిక అయినా బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపడం అనే కోరికను తీర్చబోతున్నారని చెప్పారు. కావున పార్లమెంట్ ఎలక్షన్ లో బిజెపి బిఆర్ఎస్ పార్టీలకు కాకుండా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.
బెజ్జంకిలో వెలిచాల రేఖ ఇంటింటా ప్రచారం
- Advertisment -