కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిలువాలని టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు,రాష్ట్రాధ్యక్షుడు,కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాసం రత్నాకర్ ఉపాధ్యాయులు,లెక్చరర్లు,నాన్ టీచింగ్ స్టాఫ్ కు పిలుపునిచ్చారు.శనివారం
టీటీఎల్ఎఫ్ అత్మీయ సమ్మేళనానికి మాసం రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.వెలిచాల రాజేందర్ రావు స్వంత అలోచనలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటుందని ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి మద్ధతుగా నిలువాలని సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ. మస్జిద్,300 మంది ఉపాధ్యాయులు,లెక్చరర్లు,నాన్ టీచింగ్ స్టాఫ్ సభ్యులు హాజరయ్యారు.
Velichala Rajender Rao: ‘వెలిచాల’కు మద్దతుగా నిలవాలి
- Advertisment -