- కాంగ్రెస్ దయతో నా తండ్రి చివరి కోరిక తీర్చే అవకాశం దక్కింది
- నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ ప్రజలకు తన కుటుంబ సభ్యులని, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి జీవితాన్ని ధన్యం చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగుల్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. తన తండ్రి దివంగత వెలిచాల జగపతిరావు చివరి దశలో తన నుండి కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తానని మాట తీసుకున్నారని, దేవుడి దయ, కాంగ్రెస్ పెద్దల దీవెనలతో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కిందని అన్నారు. మీ ఆశీర్వాదం కూడా ఉంటే ఎంపీగా గెలిచి, మీ మధ్యలో తిరుగుతూ కరీంనగర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. తను ఎంపీగా గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శీనన్నకు తోడుగా ఉండి, వారికి కేంద్రంలోనూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక గత ఎంపీ బండి సంజయ్ ఈనాడైనా మీ మండలాల్లో పర్యటించారా?, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఫోన్ చేసేవారా?, చివరకు మండల కేంద్రంలో జరిగే ఏ ఒక్క జనరల్ బాడీ సమావేశ ఎన్నికైన హాజరయ్యారా? అని ప్రశ్నించారు. సంజయ్ కు తన వ్యక్తిగత అభివృద్ధి మినహా ప్రజల సమస్యలతో పట్టింపు లేదని, అటువంటి సంజయ్ ని మరోసారి గెలిపిస్తే మత విద్వేషాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని చిన్నపిన్నం చేస్తారని ఆరోపించారు. చదువు సంధ్యా లేని బండి సంజయ్ ఐదేళ్లలో వచ్చే ఎంపీ ల్యాడ్స్ నిధులు 25 కోట్లలో కేవలం ఐదు కోట్లు మాత్రమే వినియోగించారని, మిగతా 20 కోట్లలో కొత్త గొప్ప ఈ మండలాల అభివృద్ధికి కేటాయించిన ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని పేర్కొన్నారు. ఇకనైనా ఆలోచించి ఓటేయాలని, బిజెపిని బొంద పెట్టి, హస్తం గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తొలుత రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ శివారు నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షకార్యదర్శులు, వివిధ విభాగాల నేతలు, గ్రామస్తులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Velichala Rajender Rao: కరీంనగర్ ప్రజలు.. నాకు కుటుంబ సభ్యులు
- Advertisment -