- కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
- జిల్లా అభివృద్ధికి విజనరీ ప్రణాళిక..
- 30 శాతం స్మార్ట్ సిటీ నిధులను పందికొక్కులా పంచుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ దోస్తులు
కరీంనగర్,జనత న్యూస్:నిస్వార్ధంగా కరీంనగర్ ను అభివృద్ధి చేసి, కోహినూర్ లా మార్చడమే తన ధ్యేయం.ప్రభుత్వ నిధులతోపాటు తన సొంత ఖర్చుతో విజనరీ ప్రణాళికను రూపొందించానని..కరీంనగర్ అభివృద్ధికి సేవకుడిల పని చేస్తానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఆదివారం పుష్పాంజలిలోని తన నివాసంలో పలు టీవీ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ప్రకటించారు.పార్లమెంట్ సభ్యులకు కేంద్రం నుండి ప్రతి ఏడాది రూ.5 కోట్ల నిధులు మంజూరు అవుతాయని, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా కొన్ని నిధులు సమకూరుతాయని తెలిపారు.వాటితోపాటు తను స్వంతంగా ప్రతి ఏటా రూ.15 కోట్ల నిధులను ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రకటించారు.యంత్ర చేయూత పేరుతో ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ తో పాటు జేసీబీ,డోజర్లు,ట్రాక్టర్లు,రోడ్డు రోలర్లు,డ్రోన్లు,బోర్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ పరికరాలతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో అవసరమైన మరమ్మత్తులు చేయనున్నట్టు తెలిపారు.యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసి ఉపాధి కల్పించే దిశగా ఇంటర్నేషనల్ లెవెల్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. దాంతోపాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు,పారితోషకాలు అందించి వారిని ప్రోత్సహిస్తానన్నారు.
క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు క్రీడ స్థలాల ఏర్పాటు కూడా కృషి చేస్తానన్నారు.నియోజకవర్గంలోని 40 మండలాల్లో క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి బహుమతులు ప్రధానం చేస్తానని, కరీంనగర్ నుండి ఒక్కరైనా ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలోకి పంపించడమే తన ధ్యేయమన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల కోసం విజినరీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నేత కార్మికులను ట్రేడింగ్ రంగం వైపు మళ్లించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశంపై స్పందిస్తూ అసలు ఈ విషయాన్ని వెలికి తీసిందే కాంగ్రెస్ పార్టీ అని, ప్రస్తుతం పారదర్శకంగా విచారణ జరుగుతున్న రుణంలో బిజెపి బి ఆర్ ఎస్ నేతల్లో వణుకు మొదలైందని విమర్శించారు. ప్రభాకర్ అనే వ్యక్తి తన స్నేహితుడి వియ్యకుడు అయినంత మాత్రాన తనకు ప్రభాకర్ రావు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని, ఓటమి భయంతో బీజేపీ, బీఆర్ఎస్ ఏదో గుడ్డ కాల్చి మీద వేస్తున్నాయి తప్ప ప్రజలకు నిజానిజాలేంటో స్పష్టంగా తెలుసునన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటేనని మ్యాచ్ ఫిక్సింగ్ దోస్తులైన బండి సంజయ్, బోయినపల్లి వినోద్ లు స్మార్ట్ సిటీ నిధుల్లోనుండి 30 శాతం డబ్బును పందికొక్కుల్లా పంచుకొని ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
తనను కరీంనగర్ ప్రజలు గుర్తుపట్టరని కేటీఆర్ చేసిన విమర్శలపై దొంగ బీ ఫారంలు ఇచ్చి నయవంచనకు పాల్పడిన నీ అయ్యని అడుగు నేను ఎవరో చెప్తాడని, నువ్వు కరీంనగర్ లోని ఏ సెంటర్ కు వచ్చి నిలబడిన నేను నా బలగం స్థానికతపై మా సత్తా చాటుకుంటామని సవాల్ చేశారు. సిగ్గూ..శరం లేని కేటీఆర్ తన గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరుతున్నారే తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశారు.నా అండ కాంగ్రెస్ పార్టీయే..నా బలం రేవంత్ రెడ్డి..నా బలగం కరీంనగర్ జిల్లా ప్రజలని..నా నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,కేంద్రంలో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో అని స్పష్టం చేశారు. తమకు ఏ పార్టీతో పోటీ ఉండబోదని, బీజేపీపై సుమారు రెండు లక్షల భారీ మెజార్టీతో తన విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.