Sunday, July 6, 2025

Velichala Rajender Rao:  సిరిసిల్ల నేతన్నలను ట్రేడింగ్ వైపు మళ్లిస్తా : వెలిచాల రాజేందర్ రావు

  • పవర్ సబ్సిడీ విషయంలో కర్ణాటక తీరును అమలు చేస్తాం
  •  అవసరమైతే పవర్ హాలిడే ప్రకటించి చేనేత రంగాన్ని కాపాడుతాం
  •  ప్రతి షెడ్డు పైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయడమే నేతన్నకు మనమిచ్చే భరోసా
  •  మీ కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం
  •  కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్

సిరిసిల్ల, జనతా న్యూస్: సిరిసిల్ల ప్రాంతం చేనేత కార్మికుల మణిహారమని, అలాంటి చేనేత రంగాన్ని గత బీఆర్ఎస్, బిజెపి పాలకులు విస్మరించి ఆ రంగాన్ని కష్టాల ఊబిలోకి నెట్టేసారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశం కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేత కార్మికులనుద్దేశించి రాజేందర్ రావు మాట్లాడుతూ చేనేత కార్మికుకు ఈ దుస్థితికి రావడానికి కారణం గత పాలకులేనని విమర్శించారు. ఒక్క సిరిసిల్ల చేనేత కార్మికులకే కాక యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులను చేసి ప్రజల నెత్తిన గుదిబండ పెట్టారని విమర్శించారు. ఇంత కష్టకాలంలోనూ రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై తాను, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలు కలిసి సుమారు పదిసార్లు సీఎంతో, పలుమార్లు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, రాహుల్ చౌదరిలతో 15 రోజులుగా అనేకసార్లు మాట్లాడినట్టు తెలిపారు. అందులో భాగంగానే తొలివిడత రూ 50 కోట్లు నిధులను విడుదల చేసిందని స్పష్టం చేశారు. నేడు రేపో సబ్సిడీతో పాటు యాన్ సబ్సిడీ కూడా విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తవుగానే నేత కార్మికుల బకాయలు పూర్తిస్థాయిలో ఇప్పించే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. పవర్ సబ్సిడీ విషయంలో కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న 12% సబ్సిడీని ఇక్కడ కూడా అమలు చేస్తామని, ఇక్కడ చేనేత రంగం ఇబ్బందుల్లో ఉండటం అవసరమైతే పవర్ హాలిడే ప్రకటించి ఈ రంగాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మొత్తం తనకే తెలిసినట్టు వ్యవహరించే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ లో వచ్చే సోలార్ ప్యానల్ గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. చదువు సంధ్య లేని బండి సంజయ్ కు అసలు ఆ విషయం తెలుసో లేదోనని ఎద్దేవా చేశారు.

 

తాను ఎంపీగా గెలిచిన వెంటనే చేనేత కార్మికుల ప్రతి షెడ్డు పైన 100% ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య తర్వాత కుండా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సిరిసిల్ల మెగా క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక నిన్న వేములవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ పక్కనే ఉన్న సిరిసిల్లపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వారణాసి టెక్స్ టైల్స్ కు నరేంద్ర మోడీ ప్రతి ఏట 1000 కోట్లు కేటాయిస్తుంటే, ఇక్కడ ఎంపి బండి సంజయ్ నేతన్నల ఆకలి కేకలకు కారణమవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం నాడు మాత్రమే బండి సంజయ్ కు చేనేత కార్మికుల గుర్తొస్తారని, ఇన్నాళ్లు వాళ్ళ ఉసురు తీసి ఈరోజు వచ్చి ఆదుకుంటాం ఓట్లు వేయండి అని ఆడుకుంటాం.. ఓట్లేయ్యండి అని అడగటం సిగ్గుచేటని విమర్శించారు. అయోధ్య రాముడు ఆలయ ప్రాణ ప్రతిష్ట కాకముందే పసుపు బియ్యం పట్టుకొచ్చి ప్రజలను ఓట్ల అడగటానికి బిజెపి నేతలకు సిగ్గుండాలి అన్నారు. దేవుడు దేవుడు అని జపం చేస్తే బిజెపి నేతలు, దక్షిణ కాశీగా వేములవాడకు మంచి పేరు పెట్టారు గాని ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించలేదని, అదే ఉత్తర కాశిగా ఉన్న వారణాసి ఆలయానికి 1000 కోట్లు కేటాయించిన ఘనుడు నరేంద్ర మోడీ అని ఆగ్రహ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామరాజ్యం సాధించి పెడుతుందని, ఒక్కరికి చిన్న సమస్య కూడా లేకుండా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక తన సొంత మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ సిరిసిల్ల నేత కార్మికులను ట్రేడింగ్ వైపు మళ్ళించినట్టు తెలిపారు. తద్వారా తాము నేసిన బట్టలు తామే అమ్ముకోవడం వల్ల ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు చేనేత కార్మికుల కలలో ఆనందం మిగులుతుందని పేర్కొన్నారు. ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి తనని ఎంపీగా గెలిపించాలని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page