కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్,జనత న్యూస్: దేశంలోని ప్రజలను మభ్యపెట్టి, 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు.సోమవారం నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ యందు సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సీపీఐ గ్రామ,మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజాసంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి రాజేందర్ రావు హజరుమై మాట్లాడారు. ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంచరించుకున్నాయని, ముఖ్యంగా నియంత పాలనతో ముందుకు సాగుతున్న బీజేపీకి, రామ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ కి మధ్య ఉద్యమం జరగబోతుందన్నారు.బీజేపీ గెలిస్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తామని ఒకరు,రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మరొకరు, రిజర్వేషన్లను రూపుమాపుతామని ఇంకొకరు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే ఉత్తర భారత దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మిగతా ప్రాంతాల్లోనూ బొంద పెట్టేందుకు ఇండియా కూటమిలోని కమ్యూనిస్ట్ ల కృషి గర్హానియమన్నారు.రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డీలు మాట్లాడుతూ 100 కోట్ల లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ చేసిన బీజేపీ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలకోట్ల అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు వదిలిందని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర రదసారధిగా చురుగ్గా పనిచేసే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. 89 మంది దత్తపుత్రులను ఏర్పాటు చేసుకొని ప్రజాధనాన్ని లూటి చేసి స్వీస్ బ్యాంకులకు తరలించిన బీజేపకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలోని ఒక సీట్లోనూ సీపీఐ పోటీ చేయనప్పటికీ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు.
అబద్దాలకోరు మోడీని ఇంటికి సాగనంపాలి..
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,ప్రజలను వంచించిన అబద్దాలకోరు నరేంద్ర మోడీని,మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ని ఓడించి సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె .నారాయణ సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారుఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్,సిద్దిపేట,హనుమకొండ,రాజన్న సిరిసిల్ల,జగిత్యాల,పెద్దపల్లి, జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్,కర్రె బిక్షపతి,గుంటి వేణు, వెన్న సురేష్,తాండ్ర సదానందం,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, గడిపే మల్లేష్,ఆదరి శ్రీనివాస్,కసిరెడ్డి మణికంఠ రెడ్డి లతోపాటు వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు,కౌన్సిల్ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.