ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు
కరీంనగర్-జనత న్యూస్
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్ నవీన్ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాలకు పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ ఈ నెల 20న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. భాషా ప్రయక్త రాష్ట్రము కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి , అసువులు బాసిన మహనీయుని త్యాగనికి స్ఫూర్తిగా గుర్తు గా 1985 డిసెంబర్ నెలలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు విశ్వవిద్యాలయంను నెలకొల్పి తరువాత కాలంలో పొట్టి శ్రీరాములుగా నామకరణం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు పేరుని తొలగించి, సురవరం ప్రతాపరెడ్డి పేరును చేర్చడం నీతి బాహ్యమైన, హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఒక మహనీయుని పేరు తొలగించే ముందు , వారి త్యాగం, విలువలు గుర్తుంచుకోవాలని సీఎంకు సూచించారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును ఏదైనా నూతనంగా ఏర్పాటు చేసే సంస్థకు పెట్టుకోవడంపై అభ్యంతరం లేదని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ చర్యను నిలిపి వేసి , పొట్టి శ్రీరాములు పేరును పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణలోనే కాకుండా రాజమండ్రి , శ్రీశైలం , కూచిపూడి ఈ ప్రాంతాల్లో తెలుగు వర్సిటీకి అనుబంధం శాఖలు ఉన్నాయని.. రెండు తెలుగు రాష్ట్రాలు ( 58 : 42 నిష్పత్తిలో )ఈ యూనివర్సిటీని ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పొట్టి రాములు త్యాగాన్ని, ప్రస్తావించిన విషయాన్నిగుర్తు చేశారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పునరుద్ధరించి, వారి త్యాగాన్ని, గౌరవాన్ని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం అన్యాయం

- Advertisment -