Wednesday, September 18, 2024

వక్రతుండాయా ..ఏకదంతాయా గౌరీ తనయాయ ధీమహి..

-విద్యానగర్ యందు విశేషంగా పూజలందుకుంటున్న మట్టి వినాయకుడు 
– బ్రహ్మోత్సవాలను తలపిస్తున్న గణపతి నవరాత్రోత్సవాలు!
-సుమారు లక్ష భక్తులు దర్శించుకునేల కార్యక్రమాలు 
-హిందూత్వ అధ్యాత్మికను చాటేల వివిధ రూపాల్లో వినాయక అలంకరణ 
– విశేంగా ఆకట్టుకున్న మహా రుద్రాభిషేకం, కృష్​ణ లీల 
-అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్న లక్ష్మి కుబేర అలంకరణ
‌–  హిందూ సంస్కృతి, భక్తి భావం వైపు యువత
-ఉమా పుత్ర కమిటి అధ్వర్యంలో ఘనంగా గణేషుని నవరాత్రోత్సవాలు
వినాయక నవరాత్రోత్సవాలపై ‘జనతా న్యూస్’ప్రత్యేక కథనం…
వినాయకుడు,గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి గాంచి ఎక్కువ ప్రజలతో ఆరాధించబడే దేవుడు.ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంతో పాటు నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్,బాలి,బంగ్లాదేశ్ దేశాల్లోనూ.. భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి,మారిషస్, ట్రినిడాడ్,టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయమున్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం ప్రత్యేకత.గణేశుడి పట్ల భక్తి జైన,బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.గణేశుడు ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు),కళలకు,శాస్త్రాలకు అధిపతిగా,బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావిస్తూ ప్రజలు పూజలు చేస్తుంటారు.పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో,పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు.మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో గణపతిని పూజిస్తారు.ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తున్నాయి.కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ యందు ఉమా పుత్ర ఉత్సవ కమిటీ అధ్వర్యంలో  కోట సతీష్‌ అధ్యక్షతన మరికొంత మంది ప్రతినిధులు..ఓ సామాజిక ఆధ్మాత్మిక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.ఈ  వినాయక నవరాత్రోత్సవాలపై ‘జనతా న్యూస్’ప్రత్యేక కథనం…
కరీంనగర్,జనత న్యూస్:
పట్టణంలోని విద్యానగర్ ప్యారిస్ లైన్ యందు నవారాత్రోత్సవాల్లో  ఏర్పాటుచేసిన మట్టి గణపతి మండపం భక్తలను విశేషంగా ఆకర్షిస్తుంది.గణపతి ప్రతిష్టాత్మన నుండి నిత్యం వివిధ అధ్యాత్మికత కార్యక్రమాలను ఏర్పాటుచేసి హిందూత్వ అచరానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఉమా పుత్ర ఉత్సవ కమిటీ నిర్వహకులు. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధ,నిష్టతో గణేశుడిని ఆరాదించేల విన్నూతనంగా అధ్యాత్మికత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సుమారు లక్ష భక్తులు దర్శించుకునేల ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ నిర్వహాకులు.ఇప్పటికే వేల మంది భక్తులతో పూజలందుకుని దర్శించుకోవడంతో పట్టణంలో ప్యారిస్ లైన్ గణపతి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్ర ముగ్దులను చేస్తున్న మండపం..
ఈ  గణేశ్‌ మండపాన్ని చూస్తే..ఇక్కడే ఇంకాసేపు ఉండి పోవాలనిపిస్తుంది ఎవరికైన. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్నో విశేషాలు ఇక్కడ చూసి తరించవచ్చు. మండప ఆవరణలో ప్రతీదీ ప్రత్యేకమే. ఇందులో ఏర్పాటు చేసిన ఒక్కో ప్రదర్శనలో ఒక్కో  సందేశం, అందులో నిమిడీ కృతమైన భక్తి భావం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది. రోజుకో  విభిన్న ఆధ్యాత్మిక వేడుకను చూసేందుకు ఇక్కడి విద్యానగర్‌ వాసులే కాదు..జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భగవద్గీత, రామాయణంలోని ముఖ్య ఘట్టాల్లోని కొన్ని అంశాలను ఈ ప్రదర్శనలో చూసి తరించాల్సిందే. ఇక్కడి మండప వాతావరణం భక్తులను మంత్ర ముగ్దులను చేస్తుంది. నగరంలోని విద్యానగర్‌ ప్యారీస్‌ లేన్‌ మండపంలోని వాలెంటీర్లు  భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
*మట్టి గణపతి ప్రతిష్టాపన..
మట్టి గణపతుల వినియోగం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో సహాయపడుతోంది. పీవోపీ విగ్రహాలతో పోలిస్తే, మట్టి గణపతులు చాలా సహజమైనవి, ఎలాంటి రసాయనాలు లేకుండా, పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉంటాయి.గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత మట్టితో మళ్ళీ సృష్టి అవుతుంది, ప్రకృతికి ఎలాంటి హాని కలిగించదు. ఈ నేపథ్యంలో మట్టి గణపతుల వినియోగం మరింత విస్తృతం కావాలనే సదుద్దేశ్యంతో మట్టి ప్రతిమను ప్రతిష్టించడం శుభపరిణామం.
* మంచు లింగ స్థాపన..
భక్తులకు అహ్లాదకరమైన వాతావరణ
అందించేల మండపాన్ని రూపకల్పన చేశారు ఉమా పుత్ర ఉత్సవ కమిటీ నిర్వహాకులు.మండపంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతితో పాటు అమర్నాత్ మంచు లింగ తరహాలో లింగాన్ని స్థాపించారు.దీంతో భక్తులు అత్యధికంగా తరలించి వచ్చి దర్శించుకుంటున్నారు.ఆకు పచ్చని పైర్లు,గోమాత కృష్ణావతార లీలలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
ఒక్కో రోజు..ఒక్కో అనుభూతి..
రోజూ గణపతి పూజాది కార్యక్రమాలతో పాటు ఆధ్మాతిక సందేశాలు ఆకట్టుకుంటున్నాయి. మహా రుద్రాభిషేకం హైలైట్‌గా నిలిచింది. నేపాల్‌ ఖట్మండ్‌ సమీప ప్రాంతంలో తీసుకొచ్చిన రుద్రాక్షలతో పశుపతి లింగం, అమర్‌నాథ్‌ లోని మంచు శివలింగం, నవధాన్యాలతో గణపతి ప్రతిమ తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకున్నారు. మరో రోజు శ్రీ కృష్ణ లీలలు ఆకట్టుకోగా.. ఉండ్రాళ్లు, మొక్కజొన్న, తెల్ల జిల్లేడు, తమలపాకులు..ఇలా గణపతికి వివిధ నైవేద్యాలు సమర్శించి వేడుకలు నిర్వహించారు. కుభేర లక్ష్మి గణపతి అలంకరణ, కరెన్సీలతో మండపం ఆకర్శనగా నిలువనుంది.
*భారులు తీరుతున్న భక్తులు..
అయా గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలకు(జాతరాలకు )  హజరయ్యేవిధంగా భక్తులు దర్శించుకుంటున్నారు. గణపతికి ప్రత్యేక పూజలు చేయడానికి వస్తున్న భక్తులతో మండపం అవరణమంత రద్ది వాతావరణం నెలకొంది.పూజలు చేయడానికి భక్తులు క్యూలైన్ యందు అర్థరాత్రి దాటిన తర్వాత కూడ భారులు తీరడం విశేషం.
*ప్రాధాన్యతగా కుబేర లక్ష్మి గణపతి అలంకరణ ..
వినాయ నవరాత్రోత్సవాల్లో ప్యారిస్ లేన్ యందు ఏర్పాటుచేసిన మండపంలో శ్రీ కుబేర లక్ష్మి గణపతి అలంకరణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.మూడు రోజుల పాటు నిర్వహించనున్న కుబేర లక్ష్మి గణపతి అలంకరణలో వినాయకుడి ప్రతిమను కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు.
*మండపంలో తలపెట్టిన అధ్యాత్మికత కార్యక్రమాలు..
•07-09-2024 శనివారం గణపతి పూజ కార్యక్రమం
•08-09-2024 ఆదివారం భజన & ఆధ్యాత్మిక కథా కాలక్షేపం
• 09-09-2024 సామవారం మహా రుద్రాభిషేకము
•10-09-2024 మంగళవారం మహా రుద్రాభిషేకము
• 11-09-2024 బుధవారం ప్రత్యేక అలంకరణ
•12-09-2024 గురువారం ప్రత్యేక అలంకరణ, కృష్ణలీల,ఉండ్రాళ్లు,మొక్కజొన్న తెల్ల జిల్లేడు, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ…
•13,14,15 వరకు శ్రీ కుబేర లక్ష్మి గణపతి అలంకరణ,కరెన్సీతో ప్రత్యేక అలంకరణ..
ప్రజల్లో ఆధ్యాత్మిక, దేశ భక్తిని పెంచడమే లక్ష్యం
కోట సతీష్‌-అధ్యక్షుడు, ఉమాపుత్ర ఉత్సవ కమిటీ
 ప్రజల్లో ఆధ్యాత్మిక, దేశభక్తి పెంపొందించడంతో పాటు, సామాజిక సమైక్యత పెంపొందేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను వేదికగా మల్చుకుని  పలు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కథా కాలక్షేపం, పుష్పాలు, కరెన్సీ నోట్లతో అలంకరణ, కృష్ణలీల, మహా రుద్రాభిషేకం..లాంటి వినూత్న వేడుకలు నిర్వహించడమే కాకుండా భక్తులు ఆకట్టుకునేలా సందేశాలు కూడా ఇస్తున్నాం.  మహాభారతం ద్వారా సామాజిక విలువల్ని ప్రపంచానికి అందించిన మహత్తరమైన దేశం మన భారతదేశం. తరతరాలుగా ఘనమైన వారసత్వంతో ముందుకు సాగుతున్న సంస్కృతీ సంప్రదాయాలు, పవిత్రమైన పండుగలు,  ఆచారాలు అందరూ పాటించేలా తవ వంతు కృషి చేస్తున్నాం.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page