-
వాయిస్ ఫర్ యూత్ కు మంచి రెస్పాన్స్
-
సంకల్ప్ యాత్ర గ్రాండ్ సక్సెస్
-
కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించడంలో విజయం
-
ఆరోగ్య శిబిరాలకు 5 కోట్ల మంది
-
అందరికీ వైద్య పరీక్షలు,సేవల అందజేత
-
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మందికి లబ్ధి
జనతా న్యూస్,హైదరాబాద్:భారత్ ను 2047 నాటికి ప్రపంచ వేదికపై ఆధునిక భారత్ గా..ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన విక్షిత్ భారత్-2047కి పబ్లిక్ నుంచి అపూర్వ స్పందన వస్తోంది. 11 డిసెంబర్ 2023న మోడీ ఈ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. దీనికి అనుబంధంగా అంతకు ముందే విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. విక్షిత్ భారత్-2047లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాయిస్ ఫర్ యూత్ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. దేశంలో మరింత సుస్థిరత,స్వావలంబన కోసం యువత నుంచి సలహాలు,సూచనలను ఆహ్వానించింది. 2047 నాటికి వివిధ అంశాలలో విక్షిత్(ఆధునిక)భారత్ ఎలా ఉండాలి..ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏమి చేయాలి..? విక్షిత్ భారత్-2047 సాధ్యం కావడానికి యువత ఏం చేయొచ్చు అనే అంశాలపై అభిప్రాయాలను కోరింది.
ఈ నేపథ్యంలోనే విక్షిత్ భారత్-2047 కార్యక్రమంలో భాగంగా లక్షల మంది యువత కేంద్ర ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను విక్షిత్ భారత్-2047 వేదికగా పంచుకున్నారు. దేశ అభివృద్ధి కొరకు యువత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మెరుగైన సూచనలు చేయడం గమనార్హం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన యువత దేేశ ఆర్థికవృద్ధి,ఆర్థికాభివృద్ధి విషయాల్లో కీలకమైన సూచనలు,వ్యవహారాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి ఎలాగో అన్ని రంగాల్లో దేశాన్ని అద్బుతంగా తీర్చిదిద్దాలని,ప్రపంచ వేదికపై ఒక సరికొత్త ఆధునిక భారత్ గా నిలబెట్టాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో నిష్ణాతులైన నిపుణులతో పాటు..విక్షిత్ భారత్-2047లో భాగంగా యువత నుంచి వచ్చిన సూచనలు, సలహాలను సైతం పరిశీలిస్తోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పబ్లిక్ కు వివరించేందుకు ప్రారంభించబడిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రకు కూడా పబ్లిక్ నుంచి అపూర్వ స్పందన వస్తోంది. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా అధికారులు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీలు,పుర పట్టణాల్లో కలుపుకొని 1,99,199 హెల్త్ క్యాంప్స్ ను కండక్ట్ చేశారు. ఈ ఆరోగ్య శిబిరాలకు ఇప్పటి వరకు 5,19,35,933 మంది రావడం విశేషం. అంతేకాక హెల్త్ క్యాంపులకు వచ్చిన వారిలో 2.61 కోట్ల మందికి పైగా శిబిరాల వద్ద ఆయుష్మాన్ హెల్త్ కార్డులు ఇవ్వడం గమనార్హం. అంతేకాక మరో 2.62 కోట్ల మందికి పైగా టిబీ పరీక్షలు చేయడం జరిగింది. మరో 15 లక్షల మందిని ఇతర గవర్నమెంట్ ఆసుపత్రులకు రెఫర్ చేయడం జరిగింది.
అలాగే విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా ఆన్-స్పాట్ సేవలను అధికారులు అందించారు. జీపీల వారిగా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీల్లో ఐఈసీ వ్యాన్లను తిప్పి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ఇతరత్రా స్కీమ్స్ ను ప్రజలకు అధికారులు వివరించారు. ఆయా పథకాలను ఎలా పొందొచ్చు..ఎక్కడ అప్లై చేసుకోవాలని..అందుకు ఏం చేయాలి అనేటి విషయాలు వివరించడం జరిగింది. సాధారంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అంతగా ప్రయార్టీ ఇవ్వరు. ఆ పరిస్థితి తెలంగాణ,ఏపీలోనూ చాన్నాళ్లుగా కనిపించింది. అయితే విక్షిత్ సంకల్ప్ యాత్రలో భాగంగా గ్రామ పంచాయతీ,పుర పట్టణాల్లో తిప్పిన వ్యాన్ల వల్ల ఆ బాధ నుంచి పబ్లిక్ కు కాస్తా ఉపశమనం కల్గినట్లైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విక్షిత్ సంకల్ప్ యాత్రను సద్వినియోగం చేసుకోవడం విశేషం. మొత్తంగా కేంద్ర సర్కార్ లాంచ్ చేసిన విక్షిత్ భారత్-2047,విక్షిత్ సంకల్ప్ యాత్ర సక్సెస్ కావడం రియల్లీ గ్రేట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.