2016 ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన తరువాత హైదరాబాద్ ఆటతీరు ఆకట్టుకోవడం లేదు. ఎంత ప్రయత్నించినా మెరుగైన ప్రదర్శన కనిపించలేదు. అయితే ఈ ఏడాది జట్టులో కీలక మార్పు చేశారు. ఈసారి కెప్టెన్ ను మార్చారు. వేలంలో భారీ ధరల చెల్లించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ సారతిగా నియమించారు. ఈ మేరకు ఆ జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆశలు రేకెత్తాయి. మార్చి 23న ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతాతో తలపడనుంది.
2008 నుంచి ఐపీఎల్ లో కొనసాగుతున్న సన్ రైజర్స్ 2009లో గిల్ క్రిస్ట్ కెప్టెన్సీలో జట్టు విజేతగా నిలిచింది. అయితే ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ ప్రాంచైజీ హక్కులు రద్దు అయ్యాయి. ఆ తరువాత హైదరాబాద్ జట్టును సన్ టీవీ నెట్ వర్క్ దక్కించుకుంది. 2013 నుంచి లీగ్ లో ఉంటూ 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో టైటిల్ సొంతం చేసుకుంది. మరి ఈసారి ఎలాంటి ప్రదర్శన ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.