UIDAI :భారతదేశంలో గుర్తింపునకు ఆధార్ ప్రమాణికం. దేశంలో ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇప్పటికే ఆధార్ నమోదు చేసుకున్న వారు చాలా మంది అప్డేట్ చేయించుకోలేదు. దీంతో మార్చి 14 వరకు గడువు విధిస్తూ ఆలోగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అయితే తాజాగా ఉచిత ఆధార్ అప్డేట్ కు మరో మూడు నెలలు గడువును పొడగించారు. అంటే జూన్ 14 వరకు ఆధార్ గడుపు పొడగిస్తున్నట్లు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)’ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ముందుగా 2023 మార్చి 15 వరకు లాస్ట్ డేట్ ఉండగా.. ఆ తరువాత డిసెంబర్ 31 వరకు పెంచారు. ఆ తరువాత మార్చి 14 వరకు పెంచారు. అయితే మరో రెండు రోజుల్లో గడువు తీరనుండడంతో ఈ నిర్ణయం కొందరిలో ఊరట కలిగించింది. ఆధార్ నమోదు చేసుకొని 10 సంవత్సాలు పూర్తయిన తరువాత ఆధార్ నమోదు కచ్చితంగా నమోదు చేసుకోవాలని ఇప్పటికే ఉడాయ్ ప్రకటించింది.
UIDAI : ఆధార్ నమోదు గడుపు మరోసారి పెంపు..
- Advertisment -