Ugadi Festivel: కరీంనగర్, జనతా న్యూస్: ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది అంటే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈరోజు ఆరు రుచుల పచ్చడిని తయారు చేసి తాగుతూ ఉంటారు. అయితే కొన్ని సంస్థలు ఉగాది పచ్చడిని వితరణ చేస్తుంటాయి. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. హిందూ వాహిని జిల్లా సంయోజక్ ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ఆ ధ్వర్యంలో కరీంనగర్ లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉగాది పచ్చడి, బూరెలు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని రాష్ట్ర బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్ ,కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన వెయ్యి మంది భక్తులకి ఉగాది పచ్చడి, బూరెల వితరణ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఉగాది యొక్క విశిష్టతను కరీంనగర్ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో ఇదొక భాగమని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో హిందు వాహిని జిల్లా బాధ్యులు పెందోట రాజు ,బూత్కూరి సాయికిరణ్, శ్రీరామోజు వెంకన్న, మనోజ్ ,ధీరజ్ బబ్లు, సన్నీ ,న్యాయవాదులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి ,శ్రీపాద ప్రణీత్ ,బలుసుల అనిల్ ,వివినయ్ ,విష్ణు ,రాజేష్ ,తదితరులు పాల్గొన్నారు.