సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాకే నియామకాలు చేపట్టనుంది సర్కారు. ఇందుకు ఏక సభ్య కమీషన్‌ను నియమించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..60 రోజుల్లో నివేదిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఎస్సీ, బీసీ గణన లపై సెక్రటరేట్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. పంజాబ్, తమిళనాడులో అమలు అవుతున్న తీరు, హర్యానలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సంఘం సీఎంకు వివరించింది. ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమీషన్‌ను ఏర్పాటు చేసి అధ్యయనం చేయనుంది. 2011 జనాబా లెక్కల ప్రకారం ఏక సభ్య కమీషన్ నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.
రెండు నెలల తరువాత నోటిఫికేషన్లు

- Advertisment -