Tula Uma :హైదరాబాద్, జనతా న్యూస్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ చివరికి సొంత గూటికి చేరుకున్నారు. సోమవారం ఆమె కేటీఆర్ సమక్షంలో గులాబీ కండుగా కప్పుకున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగిన ఈటల రాజేందర్ తో తుల ఉమ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఆమె వేములవాడ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ముందుగా టికెట్ కేటాయించి ఆ తరువాత వికాస్ రావుకు బీఫాం అందజేయడంతో తీవ్రంగా మనస్థాపం చెందారు. అయితే తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై తుల ఉమ ఖండించారు. కానీ తాజాగా ఆమె కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. గతంలో టీఆర్ఎస్ లో తుల ఉమ్మ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఆ తరువాత వేములవాడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆమెను పక్కనబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమె ఎలాంటి హోదాలో కనిపిస్తారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Tula Uma : చివరికి BRSలో చేరి తుల ఉమ
- Advertisment -