రాయికల్, జనతా న్యూస్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పని చేసిన జక్కుల రాజేంద్ర ప్రసాద్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషిస్తూ, గ్రామానికి పాఠశాలకు మధ్య వారధిగా ఉంటూ, పాఠశాల ఉన్నతికి దోహదపడి, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి కి కృషి చేశారని వక్తలు కొనియాడారు. అనంతరం పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడ్కోల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యువీ రమణి, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వ్యవసాయ సహకారం సంఘం అధ్యక్షులు ముత్యం రెడ్డి, ఉపాధ్యాయులు రామస్వామి, చిన్నయ్య, శంకరయ్య, మహేష్, గంగాధర్, తిరుమల, కార్తీక్, గంగారాజం, శ్రీనివాస్, నర్సయ్య, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యా కమిటీ చైర్మన్ కు సన్మానం
- Advertisment -