Thursday, July 3, 2025

సమన్వయంతో పయనం..

  •  కేటీఆర్ దిశానిర్దేశం
  • హరీష్ రావు సారధ్యంలో ముందుకు..
  •  వరుసగా పార్టీ శ్రేణులతో భేటీలు⁠

హైద్రాబాద్,జనతా న్యూస్: తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది. అటు తరువాత కెసిఆర్ చిన్నపాటి ప్రమాదానికి గురయ్యారు. ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు లకు అప్పగించారు. వారు వరుసుగా పార్టీ శ్రేణులతో భేటీలు నిర్వహిస్తున్నారు. దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గవర్నర్ తీర్మానంపై మాట్లాడే క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సమన్వయంతో వ్యవహరిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి మున్ముందు ఎలా ఎదుర్కొంటామో హెచ్చరికలు పంపిస్తున్నారు.

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు నడిచేవని.. పార్టీలో రెండు వర్గాలు ఉండేవని రకరకాల ప్రచారం సాగేది. ఒక విధంగా చెప్పాలంటే కేటీఆర్ కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోయే వారన్న కామెంట్స్ వినిపించేవి. పార్టీలో చీలికకు హరీష్ రావు కారణమవుతారని కూడా విశ్లేషణలు వచ్చేవి. మొన్నటి ఓటమి తర్వాత కూడా.. కెసిఆర్ సమక్షంలో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పెద్ద తగాదా జరిగిందని.. నీవల్లే ఓడిపోయిందని ఒకరికొకరు కలహించుకున్నారని ఎల్లో మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తేలిపోయింది. శాసనసభలోనే కాదు బయట కూడా బావ బావమరుదులు ఐక్యతగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు.

శీతాకాల విడుదల భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. అందులో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. రాత్రి వరకు ఇది కొనసాగునుంది. దీనికి అధికార, విపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీనిలో భాగంగా బావా బావమరుదులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు బొల్లారం బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా.. హరీష్ రావు ఆయన పక్కన కూర్చుని కనిపించారు. ఈ ఫోటోలను హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడడం ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే కృష్ణార్జునలతో పోల్చుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page