లక్నో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి విడత ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి, రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వాయినాడ్ కు ఈ విడతలోనే ఎన్నికలు జగరనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసిపై అందరి దృష్టి ఉంది. ఈ తరుణంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ అభ్యర్థిగా కిన్నార్ మహా మండలేశ్వర్ హిమంగి సఖీ బరిలో ఉన్నారు. ఈమె ఒక ట్రాన్స్ జెండర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వెల్లడించారు.మండలేశ్వర్ హేమంగి సఖీ సొంత రాష్ట్రం కూడా గుజరాతే. బరోడాలో జన్మించిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. హిమంగీ తండ్రి డిస్ట్రిబ్యూటర్ కావడంతో బరోడా నుంచి ముంబైకి మకాం మార్చారు. హిమంగీ పలు టీవీషోలలో చేశారు. ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తోన్న తొలి ట్రాన్స్ జెండర్ హింగీ సఖీ కావడం విశేషం. ఇక 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహా మండలేశ్వర్‌గా పట్టాభిషేకం జరిగింది. అఖిల భారతీయ సాధు సమాజ్ భాగవత భూషణ్ మహా మండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది.ఇక హేమంగి సఖీ శ్రీకృష్ణుని భక్తురాలు. భగవత్ కథలు, దేవి భగవత్ కథలు కూడా రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి హేమంగి సఖీ నుంచి గట్టి పోటీ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.