కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా స్థలం కేటాయించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా మున్సిపల్ శాఖ సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ ప్రాంతంలో, (కలెక్టర్ గారి క్యాంపు ఆఫీస్ ఎదురుగా ), మరొకటి పాత మున్సిపల్ బిల్డింగ్ ప్రాంతాలను పార్కింగ్ స్థలాలుగా గుర్తించినట్లు తెలిపారు. మార్కెట్ కు వచ్చే ప్రజలు తమ వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఖరీముల్లా ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేయరాదని , ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. కాదని రూల్స్ ను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన జరిమానాలు విధించబడతాయని తెలిపారు.
కరీంనగర్ మార్కెట్ కు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి
- Advertisment -
