Wednesday, September 18, 2024

కరీం‘నగరం’లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు..
భారీ వాహనాలు లోనికి నిరాకరణ
అత్యవసర, నిత్యవసర, ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు
సెప్టెంబర్‌1 నుండి అమలు : సీపీ అభిషేక్‌ మహంతి


కరీంనగర్‌-జనత న్యూస్‌
కరీంనగర్‌ లోనికి వచ్చే భారీ వాహనాలకు ఆంక్షలు విధించారు సీపీ అభిషేక్‌ మహంతి. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
్‌ నగరంలో పెద్ద సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ఇతర సంస్థలున్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పరిమితులు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 వరకు డీసీఎంలు, ఐషర్‌ వ్యాన్‌లు, వాటర్‌ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ, రాకెట్‌ లారీలు, జేసీబీలు, ఎర్త్‌ మూవర్‌, ట్రాక్టర్లు, భారీ మోటార్‌ వాహనాలు నగరంలోని అనుమతించడం లేదని ఉత్తర్వూలు జారీ చేశారు. సెప్టెంబర్‌ 1 నుండి ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
అనుమతి లేని మార్గాలు
బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, కేబుల్‌ వంతెన, పద్మానగర్‌ జంక్షన్‌, శాతవాహన విశ్వవిద్యాలయం, బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌, అపోలో రీచ్‌ హాస్పిటల్‌, రేకుర్తి నుండి నగరం లోనికి నిర్ణీత వేళల్లో భారీ వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు.
అనుమతించే మార్గాలు..
బద్దం ఎల్లారెడ్డి విగ్రహం నుండి కేబుల్‌ వంతెన, బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ వైపు..ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు మీదుగా పద్మనగర్‌ వరకు..
శాతవాహన విశ్వవిద్యాలయం నుండి రేకుర్తి వైపు..బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ నుండి బద్దం ఎల్లారెడ్డి విగ్రహం వరకు (హైదరాబాద్‌ రోడ్‌)..తీగలగుట్టపల్లి నుండి గోపాల్‌పూర్‌ గ్రామం వరకు..రేకుర్తి నుండి శాతవాహన యూనివర్సిటీ బైపాస్‌ రోడ్డు వరకు అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ వాహనాలకు మినహాయింపులు..
ఎసెన్షియల్‌ సర్వీస్‌ వాహనాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, మిల్క్‌ వ్యాన్‌లు, నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు, పారిశుద్ధ్య సంబంధిత, పాఠశాల/కాలేజీ బస్సులు, టీజీ ఆర్టీసీ బస్సుల లకు ఎలాంటి పరిమితులు లేవని ప్రకటించారు.
నిషేధిత వాహనాలు నియంత్రిత సమయాల్లో తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ట్రాఫిక్‌ ఏసీపీ కార్యాలయం నుండి స్పష్టమైన అనుమతిని పొందవలసి ఉంటుందని స్ఫష్టం చేశారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్‌ 1 నుండి అమల్లోకి వస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page