Saturday, July 5, 2025

Toor Dal : రేషన్ కార్డుపై కందిపప్పు.. ఎప్పటి నుంచో తెలుసా?

Toor Dal : రేషన్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్డుపై బియ్యమం మాత్రమే కాకుండా కందిప్పు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. నిత్యావసర ధరల పెరుగుదలలో భాగంగా కందిపప్పు రేటు బాగా పెరిగింది. ప్రస్తుతం కిలో కందిపప్పు రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ధర పెరుగుదలపై సామాన్యుులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామన్యులకు ఊరట కలిగించేలా కిలో కందిపప్పును రూ.67కే ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కందిపప్పును కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ కందిపప్పును మొబైల్ వాహనాల ద్వారా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 31 నాటికి అన్ని రేషన్ షాపుల్లో కందిపప్పు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page