రైతు భరోసపై అభిప్రాయ సేకరణ
కరీంనగర్-జనత న్యూస్
ఈ నెల 19న శుక్రవారం కరీంనగర్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రకటన విడుదల చేశారు. నగరంలోని బొమ్మకల్ బై పాస్ రోడ్ వి`కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో రైతు భరోస పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు ఆమె తెలిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రైతులను కలెక్టర్ కోరారు.
రేపు కరీంనగర్‌కు.. డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
- Advertisment -