బండి సంజయ్‌తో కలసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
వరద నష్టంపై అధికారులతో సమీక్ష
ఖమ్మం-జనత న్యూస్
వరద బాధిత ప్రాంతాల్లో నేడు పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలసి ఖమ్మం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన నేపథ్యంలో కేంద్రం ఏరియల్ సర్వే చేపడుతారు. ఉదయం 9 గంటలకు విజయవాడ నుండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ నేరుగా ఖమ్మం వస్తుండగా, బండి సంజయ్ కుమార్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించి వరద నష్టంపై అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మం జిల్లాలోనే మంత్రులు పర్యటిస్తారు. అనంతరం శివరాజ్ సింగ్ తిరిగి ప్రత్యేక విమానంలో భోపాల్ వెళతారు. బండి సంజయ్ మాత్రం ఖమ్మం పట్టణంలోని 30వ డివిజన్ మోతె నగర్ లో, 35వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయ పరిధి సమీపంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం కోదాడలోని పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తారు. వరదలవల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి వరద నష్టంపై వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడతారు. కోదాడ పర్యటన అనంతరం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేరుకుంటారు మంత్రి బండి సంజయ్.
నేడు ఖమ్మం జిల్లాలో .. కేంద్ర మంత్రుల పర్యటన

- Advertisment -