జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
సిరిసిల్ల-జనత న్యూస్
నేటి నుండి జిల్లాలో దివ్యాంగులకు ఉప కరణాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో ఏలిమ్కో సంస్థ ఎడిప్ పథకం ద్వారా, దివ్యాంగుల కార్పోరేషన్ ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఉప కరణాలు, సహాయ పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా లోని అర్హులైన దివ్యాంగులకు చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్ళు, రోలెటర్స్, యం.ఎస్.ఐ.ఇ.డి కిట్/(యం.ఆర్.కిట్), స్మార్ట్ కేన్, అంధుల చేతి కర్ర, ఎల్ బో క్రచ్చేస్, కృత్రిమ అవయవములు, అంధ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 40 శాతం ఉన్న వికలాంగులు ఇందుకు అర్హులని..సంబంధిత డాక్టర్ సర్టిఫికెట్తో పాటు రేషన్ కార్డు, ఆధార్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు.
క్యాంపులు ఇక్కడే..
ఈ నెల 5న బోయిని పల్లి రైతు వేదిక, 6న ఇల్లతకుంట రైతు వేదిక, 7న వేములవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయము, 8న చందుర్తి రైతు వేదిక,
ఈ నెల 9న ఎల్లారెడ్డిపేట లక్ష్మి మల్లారెడ్డి కన్వెన్షన్, 10న సిరిసిల్ల సి.నా.రె. కళామందిరంలో క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు క్యాంపు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులను ఆయన కోరారు. ఇతర వివరాల కోసం 94404 69338, 94900 91770 సెల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.